Wednesday, November 27, 2024

Mahanandi | మూర్చకు గురైన బాలుడి మృతి…

నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లాలోని మహానంది ప్రముఖ పుణ్య క్షేత్రంలోని కోనేరు వద్ద స్నానమాచరిస్తూ మూర్చకు గురైన బాలుడు మృతిచెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.

సోమవారం తాడిపత్రికి చెందిన భక్తులు స్నానమాచరిస్తుండగా మూర్చకు గురికావడంతో 108 వాహనంలో నంద్యాలకు తరలించారు. మార్గమధ్యంలో తాడిపత్రి మండలం సేనగల గూడూరుకు చెందిన 9 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement