Friday, April 19, 2024

Breaking: 12ఏళ్ల లోపు వారికి కోవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి

కరోనా మహమ్మారిని తగ్గించేందుకు 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. 6నుండి 12 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కోవాగ్జిన్ టీకా వేయించుకునేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే గతంలో భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 12 ఏళ్ల వయస్సుకు మించినవారికి మాత్రమే ఉపయోగించాలని డీసీజీఐ స్పష్టం చేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement