Thursday, April 18, 2024

రేపు వర్చువల్‌ సేవా టికెట్ల దర్శన కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : నెల 12 వ తేది నుంచి తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవలకు సంబధించిన ఆన్‌లైన్‌ వర్చువల్‌ సేవా టికెట్లు , సంబంధిత దర్శన కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్య్టా ఫిబ్రవరి 22 నుంచి 28 వతేది వరకు ఆన్‌లైన్‌ వర్చువల్‌ సేవ మరియు అనుబంధ దర్శన టికెట్ల కోటా అందుబాటులో ఉండదు. కావున భక్తులు ఈవిషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement