Thursday, April 25, 2024

ఒడిశా వైపు మళ్లిన అసనీ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అసనీ తుఫాన్ ఒడిశా వైపు మళ్లింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశలో కదులుతున్న ఈ తుఫాన్.. పూరీకి నైరుతి దిశగా 590 కిలోమీటర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కు 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అసనీ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాల్లో 4-5 రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అసనీ తుఫాన్ తీరం దాటే అవకాశం లేదని అది ఏపీ, ఒడిశా, బెంగాల్ తీరం వెంబడి పయనిస్తుందని వాతావరణ విభాగం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement