Monday, December 9, 2024

AP | కేజీహెచ్‌ కొండపై గంజాయి సాగు…

విశాఖ: గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు చేయడం కలకలం రేపుతోంది. కేజీహెచ్‌ కొండపై బాలికల వసతిగృహం వెనుక ఉన్న కొండపై పలువురు స్మగ్లర్లు గంజాయి పండిస్తున్నారు. ఏడాదిన్నరకాలంగా స్మగ్లర్లు కొండపై గంజాయి పండిస్తున్నారు. నేవీ పరిధిలో ఉన్న ప్రాంతంలో గంజాయి సాగు చేయడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి పలువురు యువకులను విశాఖ వన్‌ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారీ స్థాయిలో గంజాయిని సాగు చేస్తున్నారని, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీని వెనక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఒక ముఠాగా ఏర్పడి గంజాయి సాగు చేస్తున్నారా.. లేదా ఆకతాయితనంగా చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement