Wednesday, November 27, 2024

Cuddpah – వైసిపి నేత వర్రా కేసులో నిర్ల‌క్ష్యం.. సిఐ స‌స్పెండ్.. ఎస్పీ బ‌దిలీ

కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వైసిపి నేత వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అత‌డిపై అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. మరోవైపు కడప జిల్లాలో మరో సీఐని కూడా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఫిర్యాదులు వచ్చాయి.

అంత‌కు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, అనితపై సామాజిక మాధ్యమాల్లో రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయ‌ని గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారించారు. అనంతరం బుధవారం 41-ఏ నోటీసు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలంటూ వదిలిపెట్టారు.

- Advertisement -

దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడపలోని ఎస్పీ కార్యాలయానికి కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో సమావేశమయ్యారు. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆయన ఆరా తీశారు. తిరిగి అత‌డిని అదుపులోకి తీసుకుని పోలీస్ లు వెళ్లగా, వారిని చూసి త‌ప్పించుకుని పారిపోయాడు.. ఈ నేప‌థ్యంలోనే సిఐ ను స‌స్పెండ్ చేసి ,ఎస్పీని వెంట‌నే హెడ్ క్వార్ట‌ర్ లో రిపోర్ట్ చేయాల‌ని డిజిపి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement