Tuesday, October 8, 2024

CRIME : జిల్లాలో కొత్త తరహా సైబర్ నేరాలు.. ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కిన నిందితుడు.. 3 లక్షల నగదు స్వాధీనం

కడప, (ప్రభన్యూస్): జిల్లాలో సరికొత్త తరహా సైబర్ క్రైమ్ ను జిల్లా పోలీసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్ ల కోసం వెళ్లి సైబర్ వలలో చిక్కుకుని సుమారు 4,31,000 వేల రూపాయలు పోగొట్టుకున్న మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న ప్రొద్దుటూరు పోలీసులు సైబర్ నేర గాడిని ఎట్టకేలకు అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు లక్షల రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. కడప డిపిఓలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా యస్పి మాట్లాడుతూ ఈవిషయాన్ని తెలిపారు.. జనవరి 21వ తేదీన ప్రొద్దుటూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కు వ‌చ్చిన‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఎర్రగుంట్ల, సుందరయ్య నగర్ కు చెందిన మల్లె పోగు ప్రసాద్ అనే సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సైబర్ నేరగాడు పొద్దుటూరు టౌన్ ద‌గ్గ‌ర‌ తమ బంధువులకు చెందిన ధనలక్ష్మి నెట్ సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉండేవారని తెలిపారు, తన షాప్ కు వచ్చే కస్టమర్లు డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకొని లాగ్ అవుట్ చేయకుండా వెళ్ళటం గమనించి.. సైబర్ నేరానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

ఈ క్రమంలో అరుణ అనే మహిళ అకౌంట్ నుంచి రూ 4,31,000 వేల రూపాయలు వివిధ మార్గాల్లో డ్రా చేసినట్లు తెలిపారు, ముద్దాయి ఆ మహిళ వాట్సాప్ చెక్ చేసి అందులోని కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు గుర్తించి దానికి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యూజర్నేమ్ పాస్వర్డ్ పంపి ఉండగా వాటిని తీసుకొని గూగుల్ ద్వారా కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement