Wednesday, July 28, 2021

పోలీసులతో ఉద్యమాలను ఆపలేరు: సీపీఐ

సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం ఉద్యమాలను ఆపలేరని రామకృష్ణ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం జగన్…‌ జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో 30 శాతం ఖాళీలు ఉన్నాయని ఆర్ధిక శాఖ ప్రకటించిందని తెలిపారు. సోమవారం సీఎం జగన్ నివాసం ముట్టడికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రామకృష్ణ ప్రకటించారు. ఇంటి ముట్టడికి పిలుపునిస్తే.. రెండు రోజుల ముందు నుంచే హౌస్ అరెస్టులు‌ చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News