Saturday, January 4, 2025

Counting Day – రేపు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

Kakinada : ఏపీలో ఈ నెల 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు వెలువడనున్నాయి. టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. 14 రౌండ్స్‌లో 9 టేబుల్స్‌పై అధికారులు ఓట్లను లెక్కించనున్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచిన విషయం విదితమే.ఈ ఉపఎన్నికలో 16,737 ఓటర్లలో 15,490 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

గత ఎన్నికల్లో యూటీఎఫ్‌ తరపున గెలిచిన షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉప ఎన్నికను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement