Thursday, March 28, 2024

Corruption Kings – ఎపిలో ఫోన్ పే బ‌దీలీలు ..ఐదు శాఖాల‌లో భారీగా అక్ర‌మాలు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యా దులు అందుతున్నాయి. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు బదిలీల్లో తాత్కాలిక ఉద్యోగులను తమకు అనుకూ లంగా ఉపయోగించుకుంటూ వారి వ్యక్తిగ త ఖాతా నంబర్‌కు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అనర్హులకు కోరుకున్న దగ్గర పోస్టింగ్‌ దక్కుతుండటంతో అర్హులు తమకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ పెద్దల కు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బదిలీ ల ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుంది. అయితే, మరోవైపు అవినీతి, అక్రమ సంపాదనకు రుచిమరిగిన కొంత మంది అధికారులు ఆ నిబంధనలు కూడా తమకు అనుకూలంగా మలచుకుని అందినవరకూ దోచుకుంటున్నారు. దీంతో బదిలీల ప్రక్రియ పక్కదారి పడుతుంది. మరీ ముఖ్యంగా ఐదు శాఖల్లో ఈ తంతు పెద్ద ఎత్తున జరగుతున్నట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఆన్‌లైన్‌ ప్రక్రియలో పారదర్శకంగా జరగాల్సిన ఈ బదిలీలు మనీ ట్రాన్స్‌ఫర్‌తోనే జరిగిపోతున్నాయని కొంత మంది ఉద్యోగులు పేర్కొనడం ఆయా శాఖల ఉన్నతాధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది.

అక్రమాలన్నీ ఆ ఐదు శాఖల్లోనే అధికం
డబ్బు తీసుకుని బదిలీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ప్రథానంగా ఐదు శాఖల్లో వినిపిస్తున్నాయి. మిగిలిన శాఖల్లో అరకొరా ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటకు రావడం లేదు. ముఖ్యంగా అగ్రికల్చర్‌, రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌, జలవనరుల శాఖల్లో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని కోరుకున్న చోటకు బదిలీలు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్లకు అవకాశం లేకుండాపోతోందని వాపోతున్నారు. అదికూడా బహిరంగంగా ఫోన్‌ పే, గూగుల్‌ పేవంటి వాటి ద్వారా చెల్లింపులు జరగడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా జరగాల్సిన బదిలీలు ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా జరుగుతోందంటూ కొంత మంది ఉద్యోగులు చర్చించుకోవడం విశేషం.

అనార్హులకు అందలం..అర్హులకు మొండి చేయ్యి
బదిలీలు సీనియార్టీ, ర్యాంకులు ఆధారంగా జరగడం పరిపాటి. కానీ, డబ్బులు తీసుకుని అవేమీ లేకుండా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అనర్హులకు న్యాయం జరుగుతోందని అనేక మంది వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తమకు దక్కాల్సిన పోస్టింగ్‌ ఎటువంటి అర్హత లేని వారికి దక్కుతుందని చెబుతున్నారు. తమ సర్వీసు సీనియార్టీ, ర్యాంకు ప్రాతిపదికన జరగాల్సిన ఈ బదిలీలు డబ్బే ప్రాతిపదికగా జరుగుతోందంటూ వాపోతున్నారు. దీనిపై అనేక మంది ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. సిఫార్సు లేఖలు ఇస్తున్న ప్రజా ప్రతినిధులకు కూడా తమకు జరుగుతున్న అన్యాయనంపై వినతిపత్రాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పెద్ద ఎత్తున అందుతున్న ఫిర్యాదులు
ఇదిలావుండగా, ఈ వ్యవహారం ఆనోట.. ఈనోట పాకి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పుకునేందుకు అనేక మంది ఉద్యోగులు రాజధాని బాట పడుతున్నారు. ముందుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆయా శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేయాలని కొంత మంది అర్జీలు పట్టుకుని వస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి వీటిని వెంటనే ఆపాలని వారు కోరుతున్నారు.

- Advertisement -

ఆ బదిలీలు రద్దు చేయాలి
ఇదిలా ఉండగా బదిలీల ప్రక్రియలో అన్యాయం జరిగిన వారంతా డబ్బుతో తీసుకున్న పోస్టింగ్‌లను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞ ప్తి చేస్తున్నారు. సాధారణ బదిలీల ప్రక్రియలో తమపై అధికారులు చేస్తున్న ఈ పనికి అందరికీ చెడుపేరు వస్తుందని, వెంటనే అ బదిలీలను రద్దుచేసి మళ్లిd తాజాగా నిర్వహించేలా చూడాలని వారు కోరుతున్నారు. వాస్తవానికి పోస్టింగులు ఇంకా ఇవ్వకపోయినప్పటికీ, తమకు ఫలానా చోట పోస్టింగ్‌ వచ్చిందంటూ చేస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఇటువంటి వాటిని సమూలంగా నిర్మూలించాలని వారు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాల్సిన కొంత మంది అధికారులే బహిరంగంగా తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టు సిబ్బంది ఫోన్‌ పే, గూగుల్‌ పేలకు డబ్బులు వేయించుకుని ఇలా తమకు అన్యాయం చేయడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement