Monday, October 14, 2024

సంక్రాంత్రి వేళ కరోనా దడ..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో వందల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా కేసులు పెరడంతో కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఇప్పటికే నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, కర్నూలులో కేసులు అధికంగా నమోదయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఎప్పటికప్పుడు కోవిడ్‌ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో కోవిడ్‌ కట్టడికి తీసుకోబోయే నిర్ణయాలపై చర్చిస్తున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోబోయే చర్యలతో పాటు- కోవిద్‌ కేర్‌ సెంటర్‌ల ఏర్పాటు, వాటి నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తీసుకోబోయే నియంత్రణ చర్యల గురించి అధికారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్‌ వేగవంతంపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు- సమాచారం.

జిల్లాలో కరోనా రక్కసిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి ప్రయోజనం కలిగించడం లేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్‌ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేగంగా విస్తరిస్తోందని చెబుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసు ఇప్పించాలని చెబుతోంది. అవసరమైతే కోవీడు కట్టడికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని భావిస్తోంది.

సంక్రాంతి వేళ …
సంక్రాంతి పండుగ వేళ వేరియంట్‌ మరింత విస్తరించవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో పండుగ నిర్వహణపై కూడా ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా పండుగ వేళ బంధువులు ఇళ్లకు వస్తున్న క్రమంలోఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణమే వారికి టెస్టులు చేయించాలని కూడా సూచిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో టెస్టింగ్‌ ట్రేసింగ్‌ని కూడా ముమ్మరం చేశారు. రోజుకి మూడు వేల మందికి పైగా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచడంతోనే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో టెస్ట్‌లో సంఖ్య మరింత పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో కేసుల సంఖ్య వందల్లో పెరుగుతున్నా ప్రజల్లో ఆందోళన మాత్రం కనిపించడం లేదు. కరోనా వ్యాప్తిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా దశ, దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతో కరోనా వేరియంట్‌ ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement