Saturday, May 8, 2021

మాన‌వ‌తా సంక్షోభం…..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం…
పెరుగుతున్న కేసులు
సాయంకోసం ఎదురుచూపులు
నిర్లక్ష్యం చేస్తే ఇతర దేశాలకూ వ్యాప్తి
అందుకే స్పందిస్తున్న అంతర్జాతీయ సమాజం
మరోపక్క ఆర్థిక సంక్షోభం
రోడ్డున పడిన నిరుపేదలు
పెరిగిపోతున్న సంపన్నులు
అంతరాలు పెరిగితే దాడులు తప్పవు
కొవిడ్‌ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
సామాజిక సంస్థలకు పరిమిత అధికారాలివ్వాలి
ప్రభుత్వాలకు నిపుణుల సూచనలు

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌కు అపన్న హస్తాన్నందిస్తున్నాయి. కోవిడ్‌ను ఎదుర్కొనేం దుకు అవసరమైన పరికరాలు, ఔషదాలు, ఆక్సి జన్‌ను విరాళాలుగా అందిస్తున్నాయి. ఇందుకు అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి.
భారత్‌ ఇప్పుడు మానవతా సంక్షోభాన్ని ఎదు ర్కొంటోంది. మహమ్మారి విస్తరణ మొదల య్యాక రోజువారి అత్యధిక కేసులు నమోదౌ తున్నాయి. ఇక్కడ ఆసుపత్రులన్నీ రద్దీగా ఉన్నా యి. రోగులకు పడకలు దొరకడంలేదు. దొరికినా తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో లేదు. సరి పడినంత మంది వైద్యుల్లేరు. ఉన్నవారికి అంటు వ్యాధుల్ని ఎదుర్కొనే పరికరాల కొరత నెల కొంది. రోజు రోజుకు ఇక్కడ కోవిడ్‌ కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. స్మశానవాటికల కొస్తున్న మృతదేహాలు క్యూలైన్లలో వేచిచూడా ల్సిన పరిస్థితి నెలకొంది. భారత్‌ ఇప్పుడు ప్రపంచ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ దేశంలో అవసరమైన మేర ఆక్సిజన్‌ అందుబాటులోనే ఉంది. కానీ ఇందులో ఎక్కువ భాగం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉత్పత్తవుతోంది. అక్కడ్నుంచి ఆసుపత్రు లున్న పట్టణాలు, నగరాలకు రవాణాలో పలు అడ్డంకులు ఎదురౌతున్నాయి. భారత్‌లో ఔషదాల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న ఔషదాలు కూడా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఈ దేశంలో ఆరోగ్య వ్యవస్థ పతనం అంచుకు చేరిందంటూ రెండ్రోజుల క్రితం వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొనడం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ సమయంలో వైద్యపరి కరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ కోసం భారత్‌ చేసిన విజ్ఞప్తికి అంతర్జా తీయ సమాజం స్పందించింది. బహుపాక్షిక సాయానికి సిద్దమై ంది. వెంటిలేటర్లు, టెస్ట్‌కిట్‌లు, పిపిఇ కిట్లు భారత్‌కు పంపడం మొదలైంది. అలాగే ఆక్సిజన్‌ సాంధ్రతతో కూడిన పరికరాలు విమానాల్లో ఇక్కడకు ఎగురుకుంటూ వస్తున్నాయి. అమెరికా, యుకె, యూరోపియన్‌ యూనియన్‌, ఆఖరకు భారత ప్రత్యర్ధి పాకిస్థాన్‌ కూడా పెద్దసంఖ్యలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలెం డర్లను భారత్‌కు సరఫరా చేస్తోంది. కోవీషీల్ట్‌ వ్యాక్సిన్‌ తయారీలో అత్యంత కీలకమైన ముడిపదార్ధాల సరఫరాపై అమెరికా నిషేదాన్ని ఎత్తేసింది. ఈ ఏడాది చివరకు వందకోట్ల వ్యాక్సిన్‌ ల ఉత్పత్తికి అవసరమైన రీతిలో మూలకాల సరఫరాకు సిద్దపడింది. ప్రపంచంలోని పలు దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను ఆదు కునేందుకు తమ సంసిద్దతను వ్యక్తంచేస్తున్నాయి. ప్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌, చైనా, ఇలా.. ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉంది.
భారత్‌లో నెల కొన్న ఆరోగ్య సంక్షోభం పట్ల అంతర్జాతీయ సమాజం ఇంత వేగంగా స్పందించడానికి పలు కారణాలు న్నాయి. వైరస్‌కు సరిహద్దులు, జాతీయతలు, వయసు, లింగం, మతం వంటి బేదభావాల్లేవు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితిని నిర్ల క్ష్యం చేస్తే ఇదే దుస్థితి అతి త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎదుర య్యే ప్రమాదాన్ని ఈ దేశాలన్నీ గుర్తించాయి. ప్రస్తుతం ప్రపంచం పరస్పరం అనుసంధానించబడింది. ఒక దేశంలోని ఇన్ఫక్షన్లు ఇతర దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రయాణ పరిమితులు, బహుళ పరీక్షలు, 14రోజుల దిగ్భందనాలు కూడా వీటి సంక్రమణాన్ని నిలుపు చేయలేక పోతున్నాయి. వైరస్‌ బలంగా ఉన్న ప్రాంతం నుంచి ఓ ప్రయాణీకుడు మరో దేశానికెళ్తే విమానంలోనే అతని ద్వారా సగటున 50మంది ప్రయాణీకులకు ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. పైగా ఇప్పుడు భారత్‌లో విస్తరిస్తున్న బి 1.617కొత్త వేరియంట్‌ మరింత వేగంగా సంక్రమిస్తోంది. దీని స్పైక్‌పై రెండు కీలక ఉత్పరివర్తనాల్తో డబుల్‌ మ్యూటెంట్‌గా మారి ంది. దీనికి ప్రసార వేగం ఎక్కువైంది. అలాగే కొన్ని యాంటీ బాడీలు కూడా ఈ వైరస్‌ను నిలువరించలేక పోతున్నాయి. ఈ మేరకు స్పష్టమైన పరీక్షా ఫలితాలున్నాయి. ఒక దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్యను బట్టి అక్కడ వైరస్‌ ఉత్పరివర్తనాల సంఖ్య ఆధారపడుంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో వైరస్‌ పది నుంచి 12వరకు ఉత్పరివర్తనాలు చెందుతోంది. ఆ తర్వాతది మరింతగా బలం పుంజుకుంటోంది. వైరస్‌ల వేరియంట్‌లను నియంత్రిం చడానికి ఉత్తమ మార్గం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధుల్ని నియంత్రించడం ఒక్కటేనంటూ కోవిడ్‌ 19 జెనోమిక్స్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కన్సార్టియం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ షరోన్‌పికాక్‌ పేర్కొ న్నారు. తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో సహజంగానే వైరస్‌ను ఎదుర్కోగలిగే సామర్ద్యం తక్కువగానే ఉంటుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకొచ్చి దీన్ని నియంత్రించాలి. భారతే కాదు.. ఏ దేశంలో వైరస్‌ పెరిగినా అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. అంతర్జాతీయంగా విస్తరించడానికి దానికెంతో కాలం పట్టదు. తొలి విడతలో కేవలం 24రోజుల్లోనే వైరస్‌ వందకు పైగా దేశాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 8రోజుల వ్యవధిలోనే మరో 61 దేశాల్లో తన ఉనికిని చాటగలిగింది. ఇంతవేగంగా జరుగుతున్న వైరస్‌ సంక్రమణాన్ని ప్రపంచంలో ఏ మూలనున్నా అడ్డుకోవాలన్న లక్ష్యం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో నెలకొంది.
కోవిడ్‌ నియంత్రణ ప్రభుత్వం లేదా సామాజిక సంస్థలకు మాత్రమే పరిమితం కాదు. సమాజంలో ప్రతి ఒక్కరు ఈ బాధ్యత తీసుకోవాలి. వారి పక్కనుంచి ఎవరైనా మాస్క్‌ లేకుండా ప్రయాణిస్తుంటే ఆపి నిలదీయాలి. మాస్కు ధరించాలంటూ హెచ్చరించాలి.
ఇది పోలీసులు లేక ప్రభుత్వాధికారులే నిర్వహిస్తారని భావించి నిర్లిప్తతతో వ్యవహరిస్తే కోవిడ్‌ ఏదో రోజున వారి కుటుంబాల్లో కూడా ప్రవేశించే ప్రమాదముంది. ఎవరైనా భౌతికదరం పాటించ కపోతే హెచ్చరించాలి. కళ్ళముందే మాస్క్‌ ధరించకుండా కారుల్లో ప్రయాణిస్తే ఆపి నిలదీయాలి. కోవిడ్‌ రోగులు బయట సంచరిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. సంక్రమణ వ్యాప్తి నియంత్రణపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే దీన్ని కట్టడి చేయగలుగుతాం. అవసరమైతే ప్రభుత్వం కూడా కొన్ని సామాజిక సంస్థల ప్రతినిధులకు కొన్ని అధికారాల్ని తాత్కాలికంగా బదలాయిం చాలి. మాస్కుల్లేకుండా తిరుగు తున్న వారికి పైన్లు వేయడం, భౌతికదూరం పాటించనివారిపై కేసులు నమోదు చేయడం వంటి పరిమిత అధికారాల్ని కోవిడ్‌ సమయంలో ఇవ్వాలి. ఇవన్నీ కోవిడ్‌ నియంత్రణకు సహకరిస్తా యని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News