Sunday, September 19, 2021

కరోనా వచ్చిందన్న భయంతో మహిళ మృతి..

అనంతపురం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాప్తాడు మండలం బండమీదిపల్లి లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా తేలడంతో భయంతో అక్కడికక్కడే మృతిచెందింది. పాజిటివ్ వచ్చింది అని చెప్పిన వెంటనే పీహెచ్సీలో కుప్పకూలిపోయింది నాగలక్ష్మి అనే మహిళ. ఇక అనారోగ్య కారణాలతో తాడపత్రి సమీపంలోని గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేసే యామిని అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇక అనంతపురం జిల్లాలో సండే లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల వ్యాపారాలు మూసివేతకు చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం. ఉదయం నుంచి రోడ్లపైకి రాకుండా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు…నాన్ వెజ్ మార్కెట్ లను పూర్తిగా మూసివేశారు. ఇక జిల్లాలో కరోనా టెస్టులు ఆలస్యం అవుతుండటంతో సిపిఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు జనం. కొంతమంది వైద్యులు అనవసరంగా సిటీ స్కానింగ్ లు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News