Saturday, December 7, 2024

KNL | యురేనియంపై కొనసాగుతున్న ఆందోళన..

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేవనకొండ మండలం ఈదుల దేవరకొండ వద్ద సోమవారం నాలుగు గంటలపాటు ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. జిల్లా కలెక్టర్ నుండి ఖచ్చితమైన హామీ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ భీష్పించుకు కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో కర్నూలు- బళ్లారి రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ధర్నా విరమింపజేసేందుకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. కలెక్టర్ వచ్చేదాకా ఆందోళన ఆపే ప్రసక్తే లేదని ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. ప్రజలను ఉద్దేశించి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ మాట్లాడుతూ… కలెక్టర్ కార్యాలయం నుండి ఇప్పుడే సందేశం వచ్చిందని, ఇప్పుడిప్పుడే ఇలాంటి తవ్వకాలు ఈ ప్రాంతంలో జరగని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ప్రజలు కోరారు. అనంతరం బాధితులు ధర్నా విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement