Thursday, December 9, 2021

అవి నవరత్నాలు కాదు.. నవరంధ్రాలు: చింతా మోహన్ సంచలన వ్యాఖ్య

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు వాతలు పెట్టి ముఖ్యమంత్రి.. తిరుపతి వెళ్లి అవులకు మేతలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నవి నవరత్నాలు కాదు.. నవరంధ్రాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఎటు బదిలీ చేసిందో తెలియదన్నారు. ఏపీలో బొగ్గు కొరతతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం రేట్లు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News