Thursday, April 25, 2024

ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న‌-వైసీపీ స‌ర్కార్ ది తుగ్ల‌క్ చ‌ర్య- చంద్ర‌బాబు

ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై టిడిపి స‌భ్యులు ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న నిర్వ‌హించారు. అసెంబ్లీలో స్పీకర్‌, మండలిలో పోడియం పొడియం వద్దకు దూసు కొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన తెలిపారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంతో స్పీకర్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. స్పీకర్‌ రక్షణగా వైసీపీ మంత్రులు పోడియం వద్దకు రావడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు చివరిరోజు అధికార వైసీపీ తీసుకొచ్చిన బిల్లుపై శాసనసభ, మండలి సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు చేసే ఆలోచన పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌ తీవ్రంగా స్పందించారు.

1986లో ఏర్పాటైన ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఎం సంబంధమని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ నిర్మించిన వర్సిటీకి వైఎస్సార్‌ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు. ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఉన్న సంస్థలకు పేరు మార్పు సరైనది కాదని ఏదైనా కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని సూచించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణ యం వెనక్కి తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం తుగ్లక్‌ చర్యలను అవలంభిస్తుందని ఆరోపిం చారు. ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవమని పేర్నొ్న్నారు. ఎన్టీఆర్‌ మహానుభావుడి పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా, ఇలానే చూస్తూపోతే ఆంధ్రప్రదేశ్‌ను జగనాంధ్రప్రదేశ్‌ అని కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement