Friday, April 19, 2024

వివేకా కేసు – కొత్త సిట్ ఏర్పాటు.. ఏప్రిల్ 30లోగా విచారణ పూర్తి.. సుప్రీం ఆదేశం

వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసు విచారణను ఏప్రిల్ 30వతేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ చౌరాషియా నాయకత్వం వహిస్తారని పేర్కొంది. ఈ సిట్ లో ఎస్పీ వికాస్, ఏఎస్పీ ముఖేష్ లతో పాటు మరో ఐదుగురిని చేర్చింది. గతంలో ఈ హత్య కేసు విచారించిన రామ్ సింగ్ ను విచారణ పరిధి నుంచి తొలగించింది. ఇకపై వివేకా హత్య కేసు విచారణను ఈ కొత్త సిట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సుప్రీంకోర్టులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది. రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి ఎం ఆర్ షా తెలిపారు.

విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని తులశమ్మ కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మధ్యాహ్నం 2గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం. ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ తెలిపింది. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలైనా పడుతుందని, ఈలోగా ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులశమ్మ తరపు న్యాయవాది కోరారు. అయితే ఆరునెలల్లోపు విచారణ మొదలవ్వకపోతే బెయిల్ కోసం ఏ5 దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికితీయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement