Wednesday, December 1, 2021

పేద విద్యార్థుల పాలిట.. ఆణిముత్యాల రాజు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లా కలెక్టర్లు సహజంగా పాలనాపరమైన వ్యవహారాలపై నిత్యం బి జీగా ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం లోను, అభివృద్ది ప థకాలను విజయవంతంగా ముందుకు నడిపించడంలో వారిదే కీలకపాత్ర. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా జిల్లా పాలనాధికారిగా వారే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత పని ఒత్తిడిలో ఉన్నా కొంతమంది జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో పేద ప్రజల కోసం కొంత సమయం కేటాయించి ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఈ తరహా ఆలోచన చేసేవారు పేదల కోసం సమయం కేటా యించేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాల రాజు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా మూడేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్పూర్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ, ఐఐటీలో శిక్షణ ఇచ్చి వారు జాతీయ స్థాయిలో అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేలా అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపి ప్రశంసలు అందు
కున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 2019లో బదిలీపై తూర్పు గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ కూడా స్పూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 250 మందికి జేఈఈ, ఐఐటీలో శిక్షణ ఇప్పించారు.

ఇటీవల వచ్చిన ఫలితాల్లో వారిలో 60 మంది అత్యున్నత ర్యాంకులు సాధించి తూర్పులో సరికొత్త రికార్డులు సృష్టి ంచారు. వాస్తవానికి తూర్పుగోదావరి చరిత్రలో ఇప్పటివరకు ఐఐటీలో స్థానం సాధించినవారే లేరు. ముత్యాల రాజు చొరవతో ఖరీదైన కోచింగ్‌ను నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులకు స్థానిక రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో స్పూర్తి కార్యక్రమం ద్వారా ఉచితంగా అందించి నిరుపేదల కుటుంబాలకు కొత్త మార్గాన్ని చూపించారు. రాష్ట్రంలో ఓ ఐఏఎస్‌ అధికారి ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థుల కోసం నిరంతరం శ్రమించడంతో పాటు సమయం దొరికి నపుడల్లా రెసిడెన్షియల్‌ పాఠశాలకు వెళ్లి గురువు పాత్ర కూడా ముత్యాలరాజు పోషించేవారు. ఆ స్థాయిలో వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను ఇచ్చి అత్యంత ప్రతిష్టాత్మక మైన జేఈఈ, ఐఐటీలో జాతీయ స్థాయి ర్యాంకులు సొంతం చేసుకునేలా కృషిచేశారు.

పేద విద్యార్థులకు.. ఆయన ఓ వరం
2019లో తూర్పుగోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రేవు ముత్యాలరాజు జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్పూర్తి కార్యక్రమం ద్వారా ఎన్‌ఐటీఎస్‌, ఐఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో కోచింగ్‌ ఇవ్వాలని సంకల్పించారు. ఆ దిశగా 143 మంది జేఈఈ, ఐఐటీ మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. వారికి స్థానికంగా ద్వారకా తిరుమల పెదతాడేపల్లిలో విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇప్పించారు. 6 నెలల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అధ్యాపకులతో వారికి ఉచితంగా అత్యున్నత శిక్షణను ఇచ్చారు. సమయం దొరికినపుడల్లా ముత్యాలరాజు కూడా రెసిడెన్షియల్‌కు వెళ్లి వివిధ రకాల సబ్జెక్టులలో వారికి క్లాసులు తీసుకునేవారు. ఆ దిశగా వారికి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించారు. దీంతో తాజాగా గతవారం విడుదలైన ఫలితాల్లో 143 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో 14 మంది జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. మరో 46 మంది కూడా మంచి ఫలితాలను సాధించారు. దీంతో రేవు ముత్యాలరాజు కృషితో సుమారు 60 మంది నిరుపేదలు అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్‌ విద్యను అందుకోబోతు న్నారు. వీరంతా కోర్సు పూర్తయ్యే లోపే ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News