Thursday, February 2, 2023

విశాఖ‌లో సీఎం కేసీఆర్ స‌భ‌.. తోటా చంద్రశేఖర్

సీఎం కేసీఆర్ విశాఖ‌ప‌ట్నంలో స‌భ నిర్వ‌హిస్తార‌ని బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ తెలిపారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోందన్నారు. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ తర్వాత ఈ స‌భ ఉండ‌నుంద‌న్నారు. త్వరలోనే ఈ సభకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తారని అన్నారు చంద్రశేఖర్. తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు తోట చంద్రశేఖర్. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే… ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని నాకు ఇవ్వమని చెప్పండి అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement