Friday, September 22, 2023

10 రోజుల్లో పీఆర్సీ… సీఎం జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ఉద్యోగులకు శుభ‌వార్త‌ చెప్పారు. ఇవాళ తిరుపతి లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతి సరస్వతీనగర్ లో ఉద్యోగులు సీఎం వైయస్ జగన్ ను కలిసి పీఆర్సీ పై విజ్ఞప్తి చేశారు. పి ఆర్ సి ప్రకటన చేయాలని ఉద్యోగులు ఈ సందర్భంగా సీఎం జగన్ ను కోరారు. అయితే వారి అభ్యర్థనపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింద‌ని.. పది రోజుల్లోనే దీనిపై ప్రకటన చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీనిపై ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని సిఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement