Saturday, May 21, 2022

ఓర్వకల్లు పర్యటనకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే

సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 17న కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించనున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లె మజరా గ్రామమైన గుమితం తండా గ్రామ సమీపాన గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీఎస్‌)ను పరిశీలించనున్నారు.  ఈ నెల 17న ఉదయం 9.34 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా 11 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.30 గంటకు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.35 గంటలకు గ్రీన్‌కో ఐఆర్‌ఈపీఎస్‌ వద్దకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు స్టోరేజీ ప్రాజెక్టును పరిశీలిస్తారు.

అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 12.20 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.50 గంటలకు విమానం ద్వారా బయలుదేరి 1.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.45 గంటలకు రోడ్డు మార్గన బయలుదేరి 2.05 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement