Saturday, April 20, 2024

చిరుకి ధన్యవాదాలు చెప్పిన సీఎం జగన్..

ఒకే రోజు ఏపీలో 13.72 లక్షల కరోనా వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వం వేసిన సందర్భంగా చిరంజీవి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిపిందే. మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి ట్వీట్ కి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కృషికి మీరు ఇచ్చిన కితాబుకి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు చెందుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement