Tuesday, April 16, 2024

కోవిడ్‌ వాక్సినేషన్‌పై సీఎం‌ జగన్‌ సమీక్ష..

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడంలేదని, వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలమని భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్పి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

దేశంలో వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా, అందులో కోటి వాక్సిన్లు కోవాక్సిన్‌…మిగిలినవి కోవీషీల్డ్ అని అన్నారు. ‌దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్‌ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు అవసరం అవుతుందని సీఎం అన్నారు. తొలి డోస్‌ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారని అన్నారు
.

Advertisement

తాజా వార్తలు

Advertisement