Sunday, May 29, 2022

బద్వేల్ ఉపఎన్నిక గెలుపుపై సీఎం జగన్ హర్షం

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు తెలిపారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కిందని అన్నారు. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను… ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement