Wednesday, March 27, 2024

మేనమామలా ఆదరిస్తున్న సీఎం జగన్‌.. చదువుకు బ్రేక్‌ పడకుండా విద్యా దీవెన..

అమరావతి, ఆంధ్రప్రభ: పేదరికం ఏ విద్యార్థి చదువుకూ అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగ సంస్కరణలకు పూనుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు మూలబిందువై, అమ్మ ఒడిలాంటి గొప్ప పధకానికి స్పూర్తిదాతగా నిలిచిన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టు-బడిన రోజు ఇదని, ఒక భరోసా, ఒక విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన రోజని పేర్కొన్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నత ఆశయంతో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడితే.. గత ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు-పొడిచి, అరకొర ఫీజులు చెల్లించిందని విమర్శించా రు. ఫుల్‌ ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసానిస్తూ ముందుకెళుతున్నారన్నారు. ఉన్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీలలో చదువుకుం టు-న్న విద్యార్ధుల ర్యాంకులే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జగనన్నను విద్యార్థులు తమ మేనమామగా భావిస్తున్నారని మంత్రి అన్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడారు.

మీ వల్లే పిల్లల్ని చదివించగలుగుతున్నా
అన్నా మీరు ప్రవేశపెట్టిన పధకాల్లో విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి పధకాలు ఎక్సలెంట్‌. నాలాంటి ఒంటరి మహిళలు ఈ రోజు పిల్లలను చదివించుకుంటు-న్నామంటే అది మీ వల్లే. గతంలో మా అబ్బాయి పార్ట్‌-టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ చదువుకునేవాడు, కానీ ఈ రోజు ఫుల్‌ ఫీజు ఇస్తున్నారు. గతంలో నేను డ్వాక్రా మహిళగా ఉన్నా రుణమాఫీ జరగలేదు, మీరు వచ్చిన తర్వాత మా గ్రూప్‌లో రుణమాఫీ జరిగింది. అగ్రిగోల్డ్‌లో చాలా మందితో డబ్బు కట్టిస్తే, వారంతా నా ఇంటిపై రాళ్ళేసిన రోజులున్నాయి, విజయవాడలో రోడ్లపై పోరాటాలు చేసినా ఒక్క రూపాయి వెనక్కిరాలేదు. మీరు వచ్చిన తర్వాత రెండు దఫాలుగా మాకు డబ్బు అందింది. కోవిడ్‌ సమయంలో కూడా మీరు రేషన్‌, డబ్బు ఇచ్చారు, నేను ఒకే రోజు మీకు 18 చోట్ల పాలాభిషేకం చేశాను సార్‌. నేను డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌ను. వలంటీ-ర్‌ వ్యవస్ధ చాలా బావుంది, ప్రతీ ఇంటికి వచ్చి అన్నీ దగ్గరుండి చూస్తున్నారు. ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. నాకు ఉన్న తమ్ముడు కూడా ఇంత చూడలేదు, మీరు అంతకంటే ఎక్కువగా చూస్తున్నారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ప్రైవేట్‌ వర్శీటీలో సీటొచ్చింది…
నేను ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌లో ప్రైవేట్‌ యూనివర్శిటీ-లో సీట్‌ సాధించాను. నాకు చాలా ఆనందం గా ఉంది. విట్‌ యూనివర్సిటీ- గురించి నేను విన్నాను, అక్కడ ధనవంతుల పిల్లలే చదువుకుంటారని అనుకున్నా, మా తల్లిదండ్రులు మధ్య తరగతి వారు, అంత స్తోమత లేదు, కానీ ఈ ఏడాది నేను మీ ద్వారా 35 శాతం కోటాలో సీట్‌ పొందానంటే అది మీ వల్లే. నేను కలలో కూడా ఊహించలేదు. మీరు దేశంలోనే మొదటి రాష్ట్రంగా ప్రైవేట్‌ యూనివర్శిటీ-లలో కూడా గవర్నమెంట్‌ కోటా తెచ్చి నాలాంటి చాలామంది పిల్లలను చదివిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీరు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా మైక్రోసాప్ట్‌n ప్రోగ్రామ్‌ తెచ్చి మా డిగ్రీలు పూర్తయ్యేసరికి జాబ్‌ వచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నారు.

చదువుకు బ్రేక్‌ పడకుండా ఆదుకున్నారు
మాది మధ్యతరగతి రైతు కుటు-ంబం, నేను డిప్లొమా చదువుతున్న సమయంలో బీ-టె-క్‌ చదవాలా వద్దా అని ఆలోచిస్తూ మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల గురించి తెలుసుకుని ధైర్యంగా బీ-టె-క్‌లో జాయిన్‌ అయ్యాను. అనుకున్నట్లే మీరు -టైం ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. హాస్టల్‌ అవసరాల కోసం వసతి దీవెన పధకాన్ని రూ. 20 వేలకు పెంచారు. ఇందులో మొదటి దఫా రూ. 10 వేలు అందాయి, మీరు ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ పెట్టడం వల్ల మా ఆన్‌లైన్‌ ఉద్యోగాలకు, ఇంటర్న్‌షిప్‌కు చాలా ఉపయోగంగా ఉంది. దీంతోపాటు- మైక్రోసాప్ట్‌n ప్రొడక్ట్స్‌ మీద శిక్షణ ఇప్పించడం వల్ల మాకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మేం ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నాం.

పేదలకు పెద్ద మేలు చేస్తున్నారు
నాకు ఇద్దరు పాపలు. పెద్దపాప ట్రిబుల్‌ ఐటీ-లో, చిన్నపాప బీకామ్‌ కంప్యూటర్స్‌ చదువుతున్నారు. మేం మధ్యతరగతి కుటు-ంబం నుంచి వచ్చాం, మీరు మాలాంటి పేదలను దృష్టిలో ఉంచుకుని విద్యాదీవెన, వసతిదీవెన పధకాలు పెట్టారు. మేం పిల్లలను చదివించలేక ఆపేద్దా మనుకునే సమయంలో ఈ పధకాలు వచ్చాయి. మీరు చెప్పిన ప్రతీ మాట గుర్తుంది, చదువు అనే ఆస్తి మీరు మాకు పంచారు, విద్యాదీవెనలో మాకు రెండు దఫాలుగా లబ్ది జరిగింది, వసతి దీవెనలో వచ్చిన డబ్బు కూడా మేం యాజమాన్యానికి చెల్లించాం. మా కుటు-ంబం చాలా పధకాల ద్వారా లబ్దిపొందింది. గతంలో ఎవరూ గవర్న మెంట్‌ స్కూల్‌కు వెళ్ళేవారు కాదు.. కానీ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల వలంటీ-ర్‌లు వచ్చి ప్రతి పధకం గురించి చెబుతున్నారు. మా ఇంటి ముందుకే రేషన్‌ వస్తుంది, రైతు భరోసా లబ్ది కూడా మా మామయ్యకు వచ్చింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement