Tuesday, December 7, 2021

మూడు పథకాల కింద రైతుల ఖాతాలకు నగదు జమ

తమదిది రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను సీఎం మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్‌ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. 

ఇది కూడా చదవండి: కలెక్టర్ సుప్రీం కంటే సుప్రీమా?: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News