Thursday, April 25, 2024

రికార్డు సమయంలో కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం.. సౌకర్యాలు సూపర్!

అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో, రికార్డు సమయంలో ఆస్పత్రిని నిర్మించారు. మొత్తం 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో జర్మన్‌ హ్యంగర్‌ టెంపరరీ కోవిడ్‌ హాస్పిటల్‌ గా ఏర్పాటు చేశారు. ప్రతీ పేషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్‌ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు, మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బందని వైద్య సేవలు అందించనున్నారు.

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని సీఎం జగన్ అభినందించారు. కోవిడ్‌ టైంలో, ఆక్సీజన్‌ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్‌ స్టీల్‌కు ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వారి ప్లాంట్‌ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్‌ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినని సీఎం తెలిపారు. అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement