Wednesday, March 29, 2023

Braking: పీఆర్సీపై నేడు తుది నిర్ణయం ?

పీఆర్సీపై నేడు తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల నేతల భేటీకి సమయం ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మొత్తం 16 సంఘాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో భేటీ అవనున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు ఇప్ప‌టికే ముఖ్యమంత్రి జ‌గ‌న్ పీఆర్‌సీ ఎంత ప్ర‌క‌టిస్తే ప్ర‌భుత్వం భారం ఎంత ప‌డుతుంది అనే దానిపై ఆర్థిక శాఖ ముఖ్య అధికారుల‌తో చ‌ర్చించారు. అంతే కాకుండా పీఆర్‌సీ పై పూర్తి స‌మాచారాన్ని, ప్ర‌భుత్వంపై ప‌డే భారంపై ఆర్థిక శాఖ అధికారులు పూర్తి నివేదిక‌ను సీఎం జ‌గ‌న్ కు ఇచ్చారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement