Saturday, April 20, 2024

BREAKING: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఈసారి మహిళకే హోం శాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాఖలు కేటాయించారు. కొత్త కేబినెట్ లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. కాకాణికి వ్యవసాయం శాఖ, విడుదల రజినీకి వైద్యఆరోగ్య శాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ, సీదిరి అప్పలరాజుకు మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, ముత్యాలనాయుడుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖకు కేటాయించారు.

ఇక, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ లభించింది. ఆయన జగన్ తొలి కేబినెట్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేశారు. తొలిసారి మంత్రి అయిన గుడివాడ అమర్ నాథ్ కు పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ దక్కింది.  అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ, ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ, స్టాంపులు శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ కేటాయించారు. ఇక, ఈసారి కూడా హోం శాఖను మహిళకే కేటాయించారు.  తానేటి వనితకు హోం శాఖతోపాటు ప్రకృతి విపత్తుల నివారణ శాఖ దక్కింది. జగన్ గత కేబినెట్ లో మేకతోటి సుచరిత ఆ శాఖను నిర్వహించారు. ఇక, ఆదిమూలపు సురేష్ కు మున్సిపల్ శాఖ, దాడిశెట్టి రాజాకు రోడ్లు, భవనాలు, విశ్వరూప్ కు రవాణా శాఖ, కారుమూరి నాగేశ్వరరావుకు సివిల్ సప్లైస్, జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ, మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమం, అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ కేటాయించారు. ఇక, వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పెరున్న రోజాకు టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ దక్కింది. ఈసారి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహాల శాఖ కేటాయించారు. గుమ్మునూరు జయరాంకు కార్మిక శాఖ కేటాయించారు. గతంలోనూ ఆయన కార్మిక శాఖ మంత్రిగానే పని చేశారు. ఉషశ్రీ చరణ్ కు స్త్రీ, శివుసంక్షేమం శాఖ కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement