Friday, October 4, 2024

AP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.

అనంతరం జస్టిస్ చంద్రచూడ్ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనాలిచ్చారు. టీటీడీ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీధర్, డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement