Tuesday, April 16, 2024

రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘనస్వాగతం

తిరుపతి సిటీ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న విద్యా దీవెన జూలై సెప్టెంబర్ 2022 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో మదనపల్లెలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం కి సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి చేరుకున్నారు. ఈసందర్భంగా వీరికి ఘనస్వాగతం లభించింది. అనంతరం మదనపల్లె కు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సూల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, సీఈఓ ఈఎంసి గౌతమి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి టిటిడి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనంద రెడ్డి, బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ ఉన్నారు. వీరితో పాటుగా అడిషనల్ ఎస్పీ కులశేఖర్, తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి, ఎయిర్ పోర్టు సి ఎస్ ఓ రాజశేఖర్, ఎయిర్ పోర్టు కమాండెంట్ శుక్ల, రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement