Wednesday, April 24, 2024

గోల్డ్ కంపెనీకి టోక‌రా.. వ్య‌క్తి అరెస్ట్ : ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ : ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎల్ఎం గోల్డ్ కంపెనీలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి మోసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ.. అక్టోబర్ 30వ తేదీన బంగారు నగలతో పాటు కొంత నగదును కూడా దోసుకుని వెళ్లిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. తిరుపతి నగరంలోని కొర్లగుంట ప్రాంతంలో కేఎల్ఎం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే గతంలో శ్రీకాళహస్తిలో జరిగిన పింక్ కేర్ బ్యాంక్ నేరానికి సంబంధించి అదే తరహాలో ఇక్కడ జరిగిందని వివరించారు. ఇదే సంస్థలో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ శాంత కుమార్ ప్రజల దగ్గర నుంచి బంగారు నగలను కొదవ పెట్టుకుని వారికి డబ్బులు ఇచ్చే వ్యాపారం కంపెనీ తరఫున చేస్తూ ఉండే వారిని తెలియజేశారు. ఇదే క్రమంలో ప్రజల నుంచి వ‌చ్చిన బంగారాన్ని శాంత కుమార్ తన అవసరాలకు వాడుకునే వారన్నారు. ఇతను తన భార్య, స్నేహితులు, పేరుపైన బంగారు నగలను కుదవపెట్టి ఇతరుల బంగారాన్ని కూడా ఇతను తీసుకుని ఇతర ఫైనాన్స్ సంస్థలు పెట్టి లోన్ డబ్బులు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా కంపెనీ అధికారులు గమనించి ఆడిట్ చేయడానికి బ్యాంక్ కి వస్తామన్న సమాచారాన్ని తెలియజేయడంతో శాంతి కుమార్ మొత్తం బంగారంతో పారిపోవడం జరిగిందని తెలియజేశారు. కుటుంబ సభ్యులు తీసుకుని పారిపోవడానికి తిరుపతికి వచ్చినాడని సమాచారం రావడంతో అతని పట్టుకుని అతని వద్ద నుంచి 10,13.08 గ్రాములు బంగారాన్ని, లక్ష రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీటి యొక్క విలువ రూ.34,58,998 రూపాయలు ఉంటుందన్నారు. అదేవిధంగా కంపెనీలో నలుగురూపంలో కూడా కొంత మొత్తాన్ని తీసుకోవడం జరిగిందన్నారు అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని తర్వాత రికవరీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కేసును ప్రతిభ కనబరిచిన ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి. ఎస్సై జయ స్వాములు. సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డును అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదరపు ఎస్పి అడ్మిన్ సుప్రజ. ఈస్ట్ డిఎస్పి. మురళీకృష్ణ. సిఐ శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement