Friday, March 15, 2024

తిరుప‌తి న‌వ‌త‌రం అభ్య‌ర్ధి ఎన్నిక‌ల గుర్తు ‘గ్లాసు’ ర‌ద్దు…

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌లో బిజెపి – జ‌న‌సేన కూట‌మికి ఊర‌ట ల‌భించింది… ఈ ఎన్నిక‌ల‌లో న‌వ‌త‌రం పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న అభ్య‌ర్ధికి కేటాయించిన గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేసింది.. వివ‌రాలలోకి వెళితే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్క‌డ గుర్తింపు పార్టీగా ఉన్న జనసేన నేరుగా రంగంలో లేక‌పోవ‌డంతో జ‌న‌సేన గుర్తు గ్లాస్ ను న‌వ‌త‌రం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గోదా ర‌మేష్ కుమార్ కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి కేటాయించారు.. ఆయ‌న ఆ గుర్తుతో ప్ర‌చారం కూడా ప్రారంభించారు..గ్లాస్ గుర్తు బ్యాలెట్ లో ఉండ‌టం వ‌ల్ల జ‌న‌సేన వ‌ల్ల ల‌భించే ఓట్లు కూట‌మికి ప‌డ‌క‌పోయే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టంతో వెంట‌నే బిజెపి, జ‌న‌సేన నేత‌లు ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను క‌ల‌సి న‌వ‌త‌రం పార్టీ అభ్య‌ర్థికి కేటాయించిన గుర్తును ర‌ద్దు చేయాల్సిందిగా అభ్య‌ర్ధిస్తూ లిఖిత‌పూర్వ‌కంగా లేఖ‌ను అందించారు.. ఆ లేఖ‌ను ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం న‌వ‌త‌రం పార్టీకి కేటాయించిన గ్లాస్ గుర్తును ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పోటీలో ఉన్న ఆ పార్టీ అభ్య‌ర్ధికి మ‌రో గుర్తు కేటాయించ‌వ‌ల‌సిందిగా తిరుప‌తి రిట‌ర్నింగ్ అధికారికి సూచించింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement