Thursday, April 25, 2024

బిజెపి పాలనలోనే తిరుపతి అభివృద్ధి – బిజెపి జాతీయ మీడియా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర

తిరుపతి, – భారతీయ జనతాపార్టీ పాలనలో తిరుపతి పార్లమెంటు అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఆ పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు స్థానిక భీమాస్ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ గవర్నమెంట్ చేసిన చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయన్నారు. వాటిలో 52 ఎలక్ట్రికల్ బస్సులు తిరుపతికి 65 ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నట్టు చెప్పారు. పరిశుభ్రతతో తిరుపతి రైల్వేస్టేషన్ దేశంలో మూడవ స్థానంలో నిలిచిందన్నారు.
రూ. 126 కోట్లతో ఫుడ్ పార్క్ తిరుపతి సమీపంలో ఏర్పాటు చేశారన్నారు. ఇరవై ఒక్క కొత్త రైల్వే లైన్లు రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిందని అందులో నాలుగు కొత్త రైల్వే లైన్లు తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు.
కృష్ణపట్నం వెంకటాచలం రైల్వే డబ్లింగ్ లైన్ పనులు పూర్తి అయినట్లు తెలిపారు. రూ. 1085 కోట్లతో వెంకటాచలం రైల్వే లైను తిరుపతి ఐఐటీ కి 2014 బడ్జెట్లు రూ. 1074 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో ఐదు వందల ఐదు కోట్లు ఇప్పటికే విడుదల చేశారన్నారు. ఐజర్ కు 1031 కోట్లు కేటాయించార రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటూ ఉందని ఆరోపించారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్, వారికి ఇస్తున్న డబ్బులు ప్రజల చెల్లించే పన్నుల నుంచి, వారు ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వానికి ఓటేయండి లేకుంటే పథకాలు రావంటూ భయాన్ని ప్రజలలో పుట్టిస్తున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళు ఎదిరించే వాళ్ళు ఎవరు అధికారంలో ఉండరని ఇది సత్యం, బిజెపి ప్రజాస్వామ్యాన్ని గౌరవ్ ఇస్తుందని తెలిపారు. చర్చిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది అందులో తాను తప్పు పట్టడం లేదు కానీ హిందూ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసిందంటూ ప్రశ్నించారు.
ఆధిపత్యం లేని రాష్ట్రాల్లో సైతం నేడు బిజెపి తన జెండాను ఎగుర వేస్తుంది అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు తిరుపతిలో ఎన్నికలు సజావుగా జరగకుండా రాజ్యాంగబద్ధంగా నిర్వహించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎన్నికల సమయంలో పూర్తిగా అమలవుతుండగా జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అపహాస్యం చేసినట్లే అన్నారు. ఒక రాజ్యాంగ సంస్థ మరో రాజ్యాంగ సంస్థల కేంద్ర ఎన్నికల సంఘాన్ని విభేదించడం తగదన్నారు. ఇది తప్పుడు సంస్కృతి, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం ఉన్నారు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. టిడిపి ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల నుంచి తప్పుకున్నదే కానీ అబద్ధపు ప్రచారాలు మాత్రం మానలేదన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్, డాక్టర్ పార్థసారథి డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement