Thursday, April 25, 2024

చిన్నారి ప్రాణం తీసిన తండ్రి క్షణికావేశం..

శ్రీ‌కాళ‌హ‌స్తిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియ‌ని చిన్నారిని క్ష‌ణికావేశంలో నేల‌కేసి కొట్టి చంపిన విషాద ఘ‌ట‌న ఎంతో మందిని క‌లిచి వేసింది. శ్రీకాళహస్తి వాటర్‌ వర్క్స్‌ కాలనీకి చెందిన ఇద్దరు దంపతులు, వీరి మ‌ధ్య కొంత కాలంగా చిన్న‌చిన్న గొడ‌వలు జ‌రుగుతున్నాయి. నిన్న రాత్రి మ‌ళ్లీ ఘర్షణ జరిగింది. భార్య‌తో గొడ‌వ‌కు దిగిన భ‌ర్త క్ష‌ణికావేశంలో త‌మ మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement