Friday, April 26, 2024

రాయ‌ల చెరువుకు పొంచి ఉన్న ప్ర‌మాదం

చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి ప‌రిధిలో గ‌ల రాయల చెరువుకు ప్రమాదం పొంచి ఉంది. చెరువుకు ఉత్తర భాగాన వాటర్ లీకేజీతో మరో గండి ఏర్పడింది. అధికారులు గండి పూడ్చివేతకు చర్యలు చేపట్టారు. చెరువు లీకేజీతో 16 గ్రామాలకు ప్రమాదం ఉంది. అయితే చెరువు గరిష్ఠ నీటి మట్టం 0.6 టీఎంసీల కాగా, ప్రస్తుతం చెరువులో 0.9 టీఎంసీల నీరు ఉంది. ఆదివారం నుంచి దాదాపు 20వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అధికారులు తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు. జిల్లా ప్ర‌త్యేక అధికారి ప్ర‌ద్యుమ్న‌, క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ్, ఎస్పీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం గండి పూడ్చివేత పనుల్లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. గత రాత్రి చెరువు దగ్గరే, అధికారులు, స్దానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిద్రించారు. కొందరు గ్రామస్తులైతే గ్రామాలను వదలకుండా కొండలపై, ఇళ్ల మిద్దెలపై తలదాచుకుంటున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement