Thursday, April 18, 2024

గృహ నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి

తిరుపతి : తిరుపతి నగరపాలక పరిధిలో లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాలకు కావలసిన మెటీరియల్ అందుబాటులో ఉందని వర్షాలు తగ్గిన నేపథ్యంలో నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు అందించన ఇళ్ళ స్థలాల జియో టాగింగ్ పూర్తి చేయాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో నగర పాలక సంస్థ పరిధిలోని పేదలకు కేటాయించిన ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి నగర నివాసిత లబ్ధిదారులకు కేటాయించిన ఆరు లే ఔట్ల లోని గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రతి లే ఔట్ లో రోజుకు కనీసం 50 గృహాల స్టేజ్ కన్వర్షన్లు జరగాలని అన్నారు. ప్రతి రోజు ప్రతి లే ఔట్ లలో కనీసం 15 వేల ఇటుకలను అందుబాటులో ఉంచేందుకు ఆర్డీఓ లు, తహశీల్దారులు పర్యవేక్షించాలని, ఇప్పటికైతే సరిపడా మెటీరియల్ అందుబాటులో ఉందని అన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించి భూ సేకరణ అవసరం ఉంటుందని త్వరగా కావలసిన కొత్త ఇంటి పట్టాలకు స్థల అవసరాలను తెలియజేయాలని సూచించారు. శాసన సభ్యులు మాట్లాడుతూ.. ఇంటి పట్టాలు అందుకున్న లబ్దిదారుల జియో టాగింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఇప్పటికే కేటాయించిన పట్టాలలో ఇళ్ళు నిర్మాణానికి వీలు పడని ప్రదేశం ఉంటే మార్పులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని లబ్ధిదారులకు పరిస్థితి వివరించాలని సూచించారు. ఇంటి పట్టాలు అందుకున్న లబ్ధిదారుల ఈ ఒక్క పట్టాలు రద్దు కారాదని, అర్హత కలిగి అందిన దరఖాస్తు దారులకు 90 రోజుల్లో పట్టా అందించాలని అన్నారు. పట్టాలు అందుకుని మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులకు అందించే చర్యలు చేపట్టాలని, అప్పుడే వారికి నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో పట్టా ఇచ్చి జియో టాగింగ్ జరగలేదని, స్థలం చుపలేదనే ఏ ఒక్కరూ అడగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక కార్యక్రమం అనేది గుర్తు పెట్టుకుని పేదలకు ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నగరపాలక కమీషనర్ ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై వివరిస్తూ నగరపాలక సంస్థకు సంబంధించి ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు చిందేపల్లి లే ఔట్ లో 7512 గృహాలు, జి పాళెం – 1647 , కల్లూరు – 3188, ఎం.కొత్త పల్లి – 5027 , సూరప్పకసం – 343, టి.సి.అగ్రహారం -1276 మొత్తం 18924 గృహాలకు మంజూరు జరిగిందని కేటగిరి -3 క్రింద కాంట్రాక్టర్ లు నిర్మాణాలు చేపడుతున్నారని ఇందులో 2540 గృహాలు ఇంకా ప్రారంభం కాలేదని, మిగిలినవి వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement