Tuesday, April 23, 2024

అణ‌గారిన వర్గాలకే బిజెపి ప్రాధాన్యం – ర‌త్న‌ప్ర‌భ ఎంపికే నిద‌ర్శ‌నంః సోము

తిరుపతి, – అణ‌గారిన వెనుకబడిన సామాజిక వర్గాలకు బిజెపి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఇందుకు నిదర్శనం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి రత్నప్రభ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో అణ‌గారిన వర్గాల సమావేశం నిర్వహించారు. రాజ్యాధికారంలో సామాజిక న్యాయం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఒక ఛాయ్ వాలాగా ఉన్న‌ మోడీని ప్రధాని చేయడం, అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేయడం, ఇప్పుడు ఒక వెనుకబడిన కులానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ని రత్న ప్రభ కి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు. ఇదే విధానం బీజేపీ అధికారంలో ఉన్న దేశంలోని అన్ని ప్రాంతాలలో కొనసాగుతూ ఉందన్నారు. వెనుకబడిన అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం,‌ ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడం ఇదే బిజెపి నినాదం అంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రజలకు సోషల్ ఈక్వాలిటీ ఇచ్చే ఏకైక పార్టీ తమదే అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికి అర్థం ప్రతి ఒక్కరికీ సామాజిక సమానత్వం కల్పించడం అన్నారు ఈ విధానానికి బిజెపి కట్టుబడి ఉంటుం ఉంటుందని, ప్రజలకు సమానత్వం కల్పిస్తుందని అన్నారు. ఇటీవల బిజెపి కార్యకర్త స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ తిరుమల కొండ పైన ఉన్న వెంకన్నకు ఫ్యాను అవసరం లేదు. ,సైకిలు అసలే అవసరంలేదు. ఆయనకు లక్ష్మీదేవి నివాసమైన కమలం కావాలి అన్నారు. భారతదేశంలో బిజెపి ఆవిర్భవించిన తొలి రోజులలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇది మత పార్టీ కొత్త పార్టీ, ఇతర మతాలకు ఇక్కడ సమానత్వం ఇవ్వలేరు అని అని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ చెడు ప్రచారాలకు విరుద్ధంగా బిజెపి సర్వమత సమానత్వం, సకల జనుల సమానత్వం పాల ద్వారా ప్రజలకు తెలియజేస్తోందని అన్నారు. బిజెపి జాతి కోసం ఆవిర్భవించిన పార్టీ, జాతి అంటే సకల జనుల సమానత్వమే కదా అన్నారు. ఇటువంటి పార్టీని అంతమొందించాలని ఈ పార్టీ ఆవిర్భావం నాడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. కానీ ఆనాడు నాయకుల త్యాగనిరతి నిరాడంబరత విశాల దృక్పథం పార్టీని ఈనాడు దేశవ్యాప్తంగా విస్తరించేలా చేసిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారిని పాలనా రంగంలో విశేష అనుభవం గల వ్యక్తి రత్నప్రభ ఎంపీగా గెలిపించండి అది తిరుపతి అభివృద్ధికే కాక యావత్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు అధికారంలోకి రావాలి రావాలంటే వారికి అవకాశం ఇవ్వాల‌ని, అట్లా అవకాశం ఇచ్చేది ఒక్క బిజెపికే సాధ్యం అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యులు జీవీకే నరసింహారావు, జనసేన రాయలసీమ ఇన్చార్జి పసుపులేటి హరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య బిజెపి జిల్లా నాయకులు సాయి లోకేష్ చిత్తూరు జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు కృష్ణయ్య , కడప జిల్లా నాయకులు సాయి లోకేష్, చిత్తూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు పొనగంటి భాస్కర్, న్యాయవాది వనజ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి జి వి ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement