Thursday, March 28, 2024

పద్మావతి వృద్ధాశ్రమంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

తిరుపతి సిటీ : స్థానిక అలిపిరి బైపాస్ మార్గంలోని పద్మావతి వృద్ధాశ్రమంలో బుధవారం ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సదరు ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని ఆయన జీవితం అందరికీ ఎంతో ఆదర్శప్రాయన్నారు. బంజారా ప్రజలు ఆర్థికంగా విద్యాపరంగా, సామాజికంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఎదగాలని వారి జీవనంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరేవారని చెప్పారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు గల బంజారాల అలవాట్లు, సాంప్రదాయాలు అందరికీ ఆదర్శమని తెలియజేశారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు నివేదించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులు, బంజారాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement