Tuesday, April 23, 2024

వీటిని బాగు చెయ్యరు….తాగునీరు అందించరు

కమిటీ లేక… పర్యవేక్షణ కరువు
రెండేళ్లుగా ఇదే దుస్థితి
నిధులు ఉన్నా ఖాతాకే పరిమితం
దాతల సాయంపైనా చిన్న చూపు…
సత్యవేడు – సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. అసలే మండుతున్న ఎండలు ఎక్కడెక్కడినుంచో వచ్చే రోగులు చల్లగా గ్లాసు మంచినీళ్లు తాగుదమన్నా గుక్కెడు నీరు దొరకదు. అదేంటీ ఆసుపత్రిలో సురక్షిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేశారుకదా అనుకుంటే పొరపాటే. ఆ మిషన్లకు పొసే డిస్టులేరి వాటర్ కొనేందుకు నిధులున్నా కార్చుచేసే అధికారం లేకపోవడంతో మెషిన్లు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు గురయ్యాయి. ఇవి మరమ్మత్తులకు గురై రెండేళ్లు గడుస్తున్నా వాటిని పట్టించుకునేవాళ్లు లేక రోగులు నిత్యం అవస్థల బారిన పడుతున్నారు. దీనిపై గతంలో ఎమ్మెల్యే పరిశీలించినా నేటికి పరిస్థితిలో మార్పు రాలేదు. చివరికి అక్కడ పనిచేసే సిబ్బందికూడా ఇంటినుంచి నీళ్ల నీళ్లు తెచుకోవాల్సిన పరిస్థితి. వాటిని బాగుచేసేందుకు ఆసుపత్రి ఖాతాలో నిధులున్నా కమిటీ ఏర్పాటు కాకపోవడంతో అక్కడి సమస్యలు తిరేపరిస్థిలేదు. కమిటీ ఏర్పాటుకు పేర్లు ప్రతిపాదించి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికి కమిటీ పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో ఖాతాలో నుంచి రూపైకూడా తీసి ఖర్చు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు.

దాతల సాయంపై చిన్న చూపు
మసున్న మహారాజులు, ఎంతోకొంత ఆదాయవనరులున్న యజమానులు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంతోకొంత ఉదారంగా సహాయం చేస్తుంటారు. కానీ సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి ఎమీ శాపమో  తెలియదు కాని దాతలు చేసిన సాయం పూర్తిగా మరుగున పడిపోతుంది. మొదట్లో సెవెన్ హిల్స్ క్వారీ యజమాని అంబులెన్స్ విరాళంగా ఇచ్చాడు దినికి డ్రైవర్ లేదని కొన్నాళ్ళు ములపెట్టగా ప్రస్తుతం మరమ్మత్తులు గురైనదని శాశ్వతంగా మూలన పడేసారు. ఆతర్వాత కల్కి ఆశ్రమం వారు అప్పటి కమిటీ చైర్మన్ అబ్యర్ధన మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిచ్చారు. చిన్న మరమ్మత్తులు కూడా చేయ్యలేకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది. ఈ మధ్యకాలంలో హీరో పరిశ్రమ బైక్ అంబులెన్స్ ను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం అది నేటికి వినియోగంలోకి రాలేదు. దీనికోసం ఆర్టీసీ సిబ్బందిలో ఒకరిని కేటాయించాల్సిందిగా వైద్యాధికారి డిఎం కి వినతి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా అభివృద్ధికమిటి సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో ఉన్న మౌళిక సధుపాయల కొరత తీర్చడంతోపాటు వేసవిలో రోగుల దాహం తీర్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement