Tuesday, April 23, 2024

మాట తప్పిన బిజెపి … ప్రత్యేక హోదా తీసుకురా లేని వైసిపి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం సిగ్గుచేటు…

శ్రీకాళహస్తి – తిరుపతి ఉప పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్ధులను నిలబెట్టడం సిగ్గుచేటని. రెండు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏమి ఒరగబెట్టి అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ను బలిపశువులు చేయడానికి అభ్యర్థులను నిలబెట్టడం హాస్యాస్పదం అని తెలిపారు. సోమవారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సముద్రాల బత్తయ్య నాయుడు అధ్యక్షతన రాష్ట్ర నాయకుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది అని అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక నిధులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని ఆయన తెలిపారు. నాడు విభజన సమయంలో రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీ తరహాలో భవనాలు నిర్మించి తీరుతామని చెప్పిన సంగతి మరిచారా అని హెచ్చరించారు.బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి అమరావతి నిర్మాణం కోసం రెండు చెంబులు నీళ్ళు తీసుకువచ్చి క్యాపిటల్ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాని హోదాలో ఎందుకు రాజధాని నిర్మాణానికి ఇవ్వడం లేదని గతంలో శ్రీవారి పాదాల చెంత గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని చెప్పిన మాటలు మరిచిపోయారని. కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టాలని పరిస్థితిలో రాష్ట్ర వైకాపా పార్టీ పాలన చేస్తుందని రెండు సంవత్సరాల కాలంలో ఒక లక్ష 70 వేల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన రుద్దుతున్నారు అని తెలిపారు.ప్రజాస్వామ్యం అంటే తెలియదు అసెంబ్లీ అంటే గౌరవం లేదు రాజ్యాంగబద్ధంగా జమాఖర్చులు కూడా చేయలేని పార్టీ వైసీపీ పార్టీ అని ఇలాంటి వారికి ఓట్లు ఎందుకు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మోసం చేస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ కు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ , సీనియర్ నాయకులు నరసింహులు, సీనియర్ పార్టీ నాయకురాలు ప్రమీలమ్మ, నారాయణ, చిట్టిబాబు, సుప్రజ, మహబూబ్ బాషా, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కూలి రవికుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement