Thursday, April 25, 2024

రూ.300 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణం 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : సుమారు రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన తిరుపతి రైల్వేస్టేషన్‌ విస్తరణ, పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆ పనులు 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాబోయే 40 సంవత్సరాల అవసరాలను రైలు ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్ పునర్నినిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్‌కు దక్షిణం వైపున పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కొత్త స్టేషన్‌ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పనుల్లో మొదటగా జియోలాజికల్ సర్వే పూర్తి కావడంతో క్యాంప్ ఆఫీస్, కాంక్రీట్ ల్యాబ్ & స్టోరేజ్ షెడ్‌ల ఏర్పాటుకు సంబందించిన పనులు ముందుకు సాగుతున్నాయి. భూగర్భ పార్కింగ్ అండ్ ఇతర సౌకర్యాల ఏర్పాటు కోసం బేస్మెంట్ నిర్మించేందుకు భూమి తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి.

ఇప్పుడు కొత్తగా నిర్మించనున్న  స్టేషన్‌ భవనానికి పునాదుల పనులు పూర్తి అయ్యాయి. బేస్‌మెంట్ ఫ్లోర్ మరియు గోడను  సుమారు 5,600 క్యూబిక్ మీటర్ల  కాంక్రీటుతో  ఇప్పటి వరకు పూర్తి చేసారు . కొత్త అండర్‌గ్రౌండ్ పార్కింగ్ లో  2 వీలర్స్ , అలాగే 4 వీలర్ వెహికల్స్ రెండింటినీ కలిపి పార్క్  చేసే విధంగా సదుపాయం కల్గి ఉంది. దీనితో పాటు బేస్‌మెంట్ ఫ్లోర్ రిటైనింగ్ వాల్‌లో 60% పూర్తయింది. ఇప్పటివరకు, దాదాపు 1100  మెట్రిక్ టన్నుల రీన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్‌ను ఫౌండేషన్‌లు అండ్ రిటైనింగ్ గోడలలో ఉపయోగించడం జరిగింది . బేస్‌మెంట్ , ఫ్లోర్ స్లాబ్‌ను కాంక్రీట్ చేయడానికి సెంట్రింగ్ మరియు షట్టరింగ్‌కు సంబంధించి  20% పనులు పూర్తయ్యాయి. పునర నిర్మించే తిరుపతి స్టేషన్ కు  సంబందించిన నమూనాను తిరుపతి స్టేషన్ ప్రవేశద్వారం వద్ద సాధారణ ప్రజలకు ప్రదర్శన కోసం ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement