తిరుమల : ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు గల వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత సేవలైన (వర్చువల్ పార్టిసిపేషన్) కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాతోపాటు, ఈ సేవల ద్వారా లభించే దర్శన కోటాను ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి http://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement