Monday, January 30, 2023

రాయలసీమను రాక్షస సీమగా మార్చారు : కేఏ పాల్

తిరుపతి సిటీ : రాయలసీమను రాక్షస సీముగా మార్చారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. రాయలసీమలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది శూన్యం అని విమర్శించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాడే, వైఎస్ ఆర్ జగన్ కడప జిల్లా వాళ్లే.. సీమాంధ్రను సింగపూర్ చేస్తామని చెప్పిన చంద్రబాబు చేసిందేమీ లేద‌న్నారు. తనకు రాజకీయంగా 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పడం తప్ప చేసింది శూన్యం అన్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు ది కుటుంబ పాలన అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ద్వేషిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ బిడ్డల్లారా ఇంకనైనా మేలుకుని బ‌య‌ట‌కు రండి అని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని మా పార్టీలోకి విలీనం చేయాలని.. అధికారంలోకి వచ్చేది ప్రజాశాంతి పార్టీ యే అన్నారు. నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి స్వామివారి పాదాలు వద్ద హామీలు ఇచ్చారు తప్ప అమలు చేయలేదన్నారు.

- Advertisement -
   

కేసీఆర్ కుటుంబ పాలన దుష్ట పాలన, అధర్మ పాలన చేస్తూ ఆంధ్రులను దూషిస్తున్నారు అన్నారు. ఏపీ, తెలంగాణలో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీ అని వివరించారు. ఏపీలో ఓ మహిళను సీఎం చేస్తానని… తెలంగాణలో నేను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఏ మంచి పని చేశాడని చంద్రబాబుకు ఓట్లు వేయాలన్నారు. 175 స్థానాల్లో వైసిపికి డిపాజిట్ కూడా రాదన్నారు.. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే నాతో రా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. నేను వస్తా నీ ఇంటికి నువ్వు ఒకసారి పిలువు తమ్ముడు అన్నారు. ప్రజాశాంతి పార్టీ ఏ పార్టీకి మద్దతు ఉండదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement