Thursday, March 28, 2024

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాండుస్ నేపథ్యంలో అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొందుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని, చెట్ల కింద. విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో పొర్లుతున్న చెరువులన్నీ నిండి ఇప్పటికే నీళ్లు బాగా ఉర్దూతంగా పారుతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్నవారు పట్టణాల్లో నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసించువారు సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు తరిగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపు జరిగినప్పుడు అధిక ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు ఎదుటి వాహనదారులు వెళ్లడానికి అవకాశం ఇస్తే ఇతరులు వెళ్లడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసు వాట్సాప్ నెంబర్ 8099999977. డ యల్.100 ఫోన్ చేయాలని తెలియజేశారు. సంబంధిత పోలీస్ సిబ్బంది సహాయకు చర్యలు అందించడానికి అందుబాటులోకి వస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement