Friday, April 19, 2024

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తిరుప‌తిలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

తిరుపతి సిటీ : మాండూస్ తుఫాన్ కారణంగా నగరంలో సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం సర్కిల్ ఎయిర్ బైపాస్ రోడ్డులో మ్యాన్ హోల్స్ పొంగి వర్షపు నీరు రోడ్డు పైకి రావడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవటంతో అధికారులను పిలిపించి డ్రైనేజీలోని కూడికను తీయించడంతో పాటు తుఫాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రామానుజ సర్కిల్, జై భీమ్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను పర్యటించడంతోపాటు మోకాళ్ల‌ లోతు వర్షపు నీటిలో మునిగి ఉన్న ఇళ్లల్లో బాధ్యతలు పర్యటించి వారికి భరోసా కల్పించారు. అనంతరం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడంతో పాటు అవసరం ఉన్న చోట్ల సమీప ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయడంతో పాటు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను కూడా నగరంలో విస్తృతంగా పరీక్షిస్తూ ఉంటానని ఎప్పటికప్పుడు తనకు సమాచారం తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్యే అధికారుల‌కు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సూచనలు అందజేస్తున్నారు. అలాగే కెనడీ నగర్, తెల్లగుంట, జై భీమ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ 25 ఇల్లు దాకా మనకు గురవడంతో ఆ ఇళ్లల్లో నివాసం ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. విరిగిన విద్యుత్ స్తంభాలు, ఒరిగిన వృక్షాలను పరిశీలించి అక్కడ వాళ్లు వాహనాలు దెబ్బ తినడం జరిగింది. ఆటో నగర్ ప్రాంతాలలో పర్యటించి డ్రైనేజీ ఔట్స్ను పరిశీలించారు. వెంటనే అధికారులతో కలిసి సహాయం చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేరు ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఎస్ కే బాబు, ఆంజనేయులు, ఉమా అజయ్, కార్పొరేషన్ ఎస్.ఈ మోహన్, ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement