Saturday, April 20, 2024

తిరుపతిలో జనసేనానితో జన ప్రభంజనం

అడుగడుగున అభిమానుల ఉత్సాహం
-జనసేన కవాతు విజయవంతం
-కాలినడకన పవన్ కళ్యాణ్ అభివాదం

తిరుపతి ప్రెస్ క్లబ్ – జనసేన పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి నగరంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కవాతులో పాల్గొన్నారు. ఈ కవాతు స్థానిక ఎంఆర్ పల్లి కూడలి నుండి అన్నమయ్య సర్కిల్ మీదుగా లక్ష్మీపురం కూడలి వరకు జరిగినది. ఈ కవాతు లో భాగంగా ఆయన అభిమానుల మధ్య నగర ప్రజలకు అభివాదం చేసుకుంటూ కాలినడకన స్టేజి వద్దకు చేరుకున్నారు. నగరంలోని యువత తో పాటు జిల్లా, జిల్లా సరిహద్దులలోని పట్టణాలనుంచి ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కవాతు లో పాల్గొన్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ శాతం లో పాల్గొని తమ అభిమాన నాయకుడిని చూసిన ఆనందంలో కేరింతలు, బాణాసంచా తో ముందుకు నడిచారు. దారి మధ్యలో ఆయన అభిమానులు తమ ఇళ్ల నుంచి పూల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఉత్సాహంతో నడక ప్రారంభించి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దారిలో అక్కడక్కడ కొంతమంది వీరాభిమానులు గజమాల తో తమ అభిమాన నాయకుడిని సన్మానించేదుకు ముందుకు వచ్చారు. స్థానిక ఎం ఆర్ పల్లి నుండి అన్నమయ్య సర్కిల్ తదనంతరం కొన్ని కిలోమీటర్ల మేర నడచిన ఆయన అభిమానులు వీక్షించేందుకు కార్ టాప్ లో నిల్చుని అభివాదం చేస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున యువత ఈ పాదయాత్రలో పాల్గొని తమ అభిమాన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని వెల్లువెత్తే లా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ మరింత ఉత్సాహం కేరింతలతో పాల్గొన్నారు. నగరంలో మునుపెన్నడూ కానరాని యువత జన ప్రభంజనం లా జనసేన అధిపతి తో కాలినడకన పాల్గొన్నారు. డప్పులు, బాణాసంచా, పూల వర్షం, అందరి చేతిలో కెమెరాలతో, చరవాణి లతో పవన్ కళ్యాణ్ కవాతు విజయవంతంగా లక్ష్మీపురం కూడలికి చేరుకున్నది.

ఎదురు చూపులు చూసిన అభిమానులు

జనసేన పార్టీ నాయకులు తెలిపిన విధంగా శనివారం 3.30 నిమిషాలకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చేరుకుంటారని, పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మధ్యాహ్నం 12 గంటల నుంచి స్థానిక ఎం ఆర్ పల్లి కూడలి వద్ద గుమిగూడారు. నగర పార్టీ నాయకులు తెలిపిన సమయం మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు గంటలు ఆలస్యంగా ఎంఆర్ పల్లి కూడలి చేరుకున్నారు. దీంతో అభిమానులు నిరుత్సాహ పడే తమ ఆరాధ్య అభిమాన నాయకుని కోసం మండుటెండలో ఎదురుచూడసాగారు. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసి చూసి సాయంకాలం తమ నాయకుడు చేరుకునే సమయానికి కాస్త అలసట చెందారు. శనివారం నగరంలో 44 డిగ్రీల వరకు ఎండ తన ప్రతాపం చూపిన అభిమానులు ఏమాత్రం చెందకుండా అంతే ఉత్సాహంతో తమ నాయకుడి రాక వరకు ఎదురుచూస్తూ ఉన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసుల విధులు

- Advertisement -

పవన్ కళ్యాణ్ కవాతు లో భాగంగా నగరంలో పోలీసులు నూతన ప్రణాళికలతో ఎటువంటి ఆటంకాలు, ఆగడాలు, అల్లర్లు జరక్కుండా కవాతును విజయవంతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు తమ నాయకుని చూడడానికి వీక్షించిన వారిని అదుపు చేయడంలో పోలీసులు తనదైన ప్రతిభ చూపి ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ర్యాలీని పూర్తిచేశారు. పార్టీ కార్యకర్తలను, అభిమానులను అదుపు చేయడం చాలా కష్టతరంగా మారిన, ఎంతో చాకచక్యంతో ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement