Tuesday, March 26, 2024

పాములకు నిలయంగా పాకాల రైల్వే క్వార్టర్స్??

పెద్ద పెద్ద చదువులు చదివి అనేక అనేక ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు, నిరాశతో బాధ పడుతున్న వారిని మనము నిత్యం చూస్తూనే ఉన్నాముు. ఉద్యోగం వచ్చిన తరువాత తీసుకున్న జీతానికి సరైన పనితీరు కనబర్చి, అందరి దెగ్గర ఔరా అనిపించుకునే వారిని చూస్తున్నాం. కానీ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రైల్వే కాలనీలలో వింత పరిస్థితి నెలకొంది, అసలే కరోనా ప్రపంచ వ్యాప్తంగా పడగలై విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు వారి పరిధిలో ఉన్న పనులను పూర్తి స్థాయిలో చేయలేకపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చును. స్థానిక పాకాల ఐ.ఓ.డబ్ల్యూ అధికారి కిషోర్ వివరణ అడగగా పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది. అధికారులు ఇంకనైన పాకాల రైల్వే కాలనీ పరిసరాలను చొరవ చూపి పలు సమస్యల నుంచి విముక్తిని పరిష్కరిస్తారో లేదో వేచి చూద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement