Friday, June 25, 2021

తిరుమ‌ల‌లో గ‌దుల కేటాయింపు మ‌రింత సుల‌భ‌త‌రం

తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపును టీటీడీ మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. సాధార‌ణ భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపున‌కు 6 చోట్ల రిజిస్ట్రేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. జీఎన్‌సీ, బాలాజీ బ‌స్టాండ్, కౌస్తుభం, రామ్‌భ‌గీచా, ఎంబీసీ, సీఆర్‌వో వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. పేరు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ఎంఎస్ ద్వారా గ‌దుల కేటాయింపు స‌మాచారం వ‌స్తుంది. ఎస్ఎంఎస్ రాగానే న‌గ‌దు చెల్లించి గ‌దిని పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉద‌యం 8 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News