Thursday, April 25, 2024

సమిష్టిగా అభ్యర్థులను గెలిపించుకుందాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి సిటీ : అందరం సమన్వయంతో సమిష్టిగా అభ్యర్థులను గెలిపించుకుందామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ నందు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం చేయడం వంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే కలిసికట్టుగా పని చేసి విజయం సాధించాలని.. ఆ దిశగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరూ ఒక సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మైనింగ్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు దీనికోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలుమేరకు అభ్యర్థును గెలిపించి బాధ్యత గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు.. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. వారివారి నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లను చేర్పించేందుకు ఒక యజ్ఞం లాగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మన అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement